Rithika Singh: నేరుగా ఒటీటీకి వస్తున్న భయపెట్టే 'వళరి'

Valari Movie Update

  • రితికా సింగ్ తాజా చిత్రంగా 'వళరి' 
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
  • మార్చి 6 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్


దెయ్యం అనే నేపథ్యం ప్రేక్షకులను ఎప్పుడూ భయపెట్టే అంశమే. దెయ్యాలు ఉన్నాయా .. లేవా అనే విషయం అటుంచితే, భయపడుతూనే ఈ తరహా సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి హారర్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

అలాంటి ఒక సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ నుంచి రావడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమానే 'వళరి'. రితికా సింగ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఆమె జోడీగా శ్రీరామ్ కనిపించనున్నాడు. మ్రితిక సంతోషిణి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా, థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ తెరపైకి వచ్చేస్తోంది. 

మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా వదిలిన టీజర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలానికి ముందు తమిళ ప్రాంతంలో 'వళరి' అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించేవారు. ఎంతో ఆయుధ సామాగ్రి ఉన్న ఆంగ్లేయులను భయపెట్టిన ఆయుధం ఇది. అలాంటి ఆయుధానికీ .. దెయ్యానికి ఉన్న సంబంధమేమిటనేదే కథ.

Rithika Singh
Sri Ram
Valari Movie
  • Loading...

More Telugu News