Nirmala Sitharaman: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
- ఏపీ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్
- నరసాపురం మండలం పీఎం లంకలో డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ సందర్శన
- శిక్షణ పొందుతున్న విద్యార్థులు, మహిళలతో మాటామంతి
- పీఎం లంకలో సముద్ర కోత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో పర్యటించారు. నిర్మలా సీతారామన్ పీఎం లంక (పెదమైనవాని లంక) వద్ద డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ ను సందర్శించి, అక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ లో భాగంగా శిక్షణ పొందుతున్న మహిళలతోనూ ఆమె ముచ్చటించారు.
ఈ సందర్భంగా నిర్మల మీడియాతో మాట్లాడుతూ... పీఎం లంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఇది పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని, ఈ తరహా ప్రాజెక్టు దేశంలో ఇదే మొదటిదని తెలిపారు.
పీఎం లంకలో రక్షణ గోడ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.