Telugu Raithu President: తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం.. చంద్రబాబు ఆరా

Murder attempt on Telugu Raithu president Marreddy Srinivasa Reddy

  • ఒంగోలులో మర్రెడ్డిపై కత్తితో దాడి
  • ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మర్రెడ్డి
  • ఆర్థిక లావాదేవీలే కారణం

ఆంధ్రప్రదేశ్ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయనపై కత్తితో దాడి చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. జిమ్స్ లో వైద్యుడు రామచంద్రారెడ్డిని కలిసి ఆర్థిక లావాదేవీలపై చర్చిస్తుండగా... ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మర్రెడ్డిని ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News