Alla Ramakrishna Reddy: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

Alla Ramakrishna Reddy joined YSRCP

  • డిసెంబర్ లో వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్కే
  • నిన్న రాత్రి ఆర్కేతో చర్చలు జరిపిన విజయసాయి
  • నియోజకవర్గ గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించే అవకాశం

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు. డిసెంబర్ లో ఆయన వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మళ్లీ వైసీపీలో చేరేందుకు ఆర్కేను ఒప్పించారు. మరోవైపు, మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది.

Alla Ramakrishna Reddy
Jagan
vijayasai
YSRCP
AP Politics
  • Loading...

More Telugu News