Balu: బాలుగారు అక్కడికి రావడానికి నేనూ కారణమే: శుభలేఖ సుధాకర్

Subhalekha Sudhakar Interview

  • కరోనా సమయంలో జరిగిన షూటింగ్ 
  • తన మాటపై నమ్మకంతో బాలు వచ్చారని వెల్లడి 
  • ఆ గిల్ట్ తనకి ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్య  

బాలసుబ్రహ్మణ్యం .. కరోనాతో చనిపోయారనే విషయం తెలిసిందే. పాటల కార్యక్రమానికి సంబంధించిన షూటింగులో పాల్గొని వెళ్లిన తరువాత ఆయన కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉన్న ఆయన, ఇక తిరిగి రాలేదు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. 

"కరోనా రోజుల్లోనే నేను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో 'అమ్మ' సీరియల్ షూటింగులో ఉన్నాను. అప్పుడు చెన్నై నుంచి బాలు గారు నాకు కాల్ చేశారు. '20 రోజులుగా అక్కడ పనిచేస్తున్నారు కదా .. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అని ఆయన అడిగారు. 'ఎవరూ లేరండీ .. మా షూటింగు మాత్రమే జరుగుతోంది' అని నేను చెప్పాను. 'అన్ని జాగ్రత్తలతో పనులు జరుగుతున్నాయి .. మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే .. మీకు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు' అని అన్నాను.

"నేను అలా అనడంతో ఆయన నా మాటపై గల నమ్మకంతో అక్కడికి వచ్చారు .. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అక్కడ వాతావరణం బాగుందని చెప్పి ఆయన రావడానికి నేను కారకుడనయ్యాను. ఆ గిల్ట్ నేను ఈ భూమ్మీద ఉన్నంతవరకూ ఉంటుంది" అని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.

Balu
Subhalekha Sudhakar
  • Loading...

More Telugu News