Varun Tej: మీ డబ్బుకి న్యాయం చేసే సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్': వరుణ్ తేజ్

Operation Valentaine Movie Update

  • వరుణ్ తేజ్ హీరోగా 'ఆపరేషన్ వాలెంటైన్'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న హీరో 
  • కథానాయికగా కనిపించనున్న మానుషి చిల్లర్ 
  • మార్చి 1వ తేదీన సినిమా విడుదల 


వరుణ్ తేజ్ హీరోగా శక్తిప్రతాప్ సింగ్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. మానుషి చిల్లర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రుహాని శర్మ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా, మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం జరిగిన ఈవెంటులో వరుణ్ తేజ్ మాట్లాడాడు. 

"మీ అందరికీ ప్రధానమైన వినోద సాధనం సినిమా అనే సంగతి నాకు తెలుసు. అందువలన నేను కొత్తగా కనిపించడానికీ, నా కథలు కొత్తగా కనిపించడానికి నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. అలా నేను చేసిన సినిమానే ఇది. టికెట్ కోసం మీరు పెట్టిన డబ్బులకు న్యాయం చేసేదిగా ఈ సినిమా ఉంటుందని నేను బలంగా చెబుతున్నాను" అన్నాడు.

తెలుగులో మొదటిసారిగా వస్తున్న ఏరియల్ సినిమా ఇది. సరిహద్దుల్లో ఎలా ఉంటుంది? అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? జవాన్ల త్యాగాలు ఎలా ఉంటాయి? అనేది ఈ సినిమా చెబుతుంది. మీ అందరిలో దేశభక్తి ఉంటుంది .. ఈ సినిమా చూసిన తరువాత మరింత పెరుగుతుంది" అని చెప్పాడు. 

Varun Tej
Manushi Chhillar
Ruhani Sharma
Tollywood
Movie News
  • Loading...

More Telugu News