Atluri Purnachandra Rao: నేను రజనీకాంత్ గారి చుట్టూ కూడా అన్నిసార్లు తిరగలేదు: నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు

Atluri Purnachandra Rao Interview

  • వివిధ భాషల్లో నిర్మాతగా మంచి పేరు  
  • ఆయన బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ 
  • అజిత్ ఇబ్బంది పెట్టాడని వెల్లడి 
  • ఇండస్ట్రీలో మార్పు అర్థమైందని వ్యాఖ్య


అట్లూరి పూర్ణచంద్రరావు .. దశాబ్దాల పాటు చిత్రపరిశ్రమలో కొనసాగిన నిర్మాత. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .  హిందీ భాషల్లో ఆయన బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాంటి ఆయన తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో అజిత్ నుంచి తనకి ఎదురైన అనుభవాన్ని గురించి గుర్తుచేసుకున్నారు. 

"అజిత్ ను 'పెళ్లి పుస్తకం' సినిమాతో హీరోగా నేనే పరిచయం చేశాను. ఆ తరువాత అతను తమిళంలో స్టార్ హీరో అయ్యాడు. ఆ సమయంలో నేను విజయ్ .. విక్రమ్ ల తోను సినిమాలు నిర్మించాను. అలాగే అజిత్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అప్పుడు ఆయన ఊహించని పారితోషికం అడిగాడు. సింగిల్ పేమెంట్ క్రింద ఇచ్చేశాను. అయినా అతను రోజులు పొడిగిస్తూ వెళ్లాడు" అని అన్నారు. 

"హిందీలో నేను అమితాబ్ గారితో సినిమాలు చేశాను ... తమిళంలో రజనీకాంత్ గారితో 9 సినిమాలు నిర్మించాను. అయినా వాళ్ల చుట్టూ కూడా నేను అన్నిసార్లు తిరగలేదు. అంతగా అజిత్ తిప్పించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పు నాకు అజిత్ వల్లనే అర్థమైంది. దాంతో నేను నా డబ్బు వెనక్కి తీసుకోవడం జరిగింది" అని చెప్పారు. 

Atluri Purnachandra Rao
Amitabh Bachchan
Rajanikanth
Ajith
  • Loading...

More Telugu News