Abhinav Gomatam: హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో కమెడియన్!

Abhinav Gomatam Interview

  • కమెడియన్ గా అభినవ్ కి మంచి గుర్తింపు 
  • 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా'తో హీరోగా ఎంట్రీ 
  • కథానాయికగా వైశాలి పరిచయం 
  • ఈ నెల 23వ తేదీన సినిమా విడుదల   


వెండితెరపై కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న చాలామంది, ఆ తరువాత  హీరోలుగా కూడా కొంతకాలం పాటు సందడి చేశారు. ఆ జాబితాలో బ్రహ్మానందం .. అలీ .. సునీల్ వంటివారు కనిపిస్తారు. ఆ తరువాత సప్తగిరి కూడా కొన్ని సినిమాల్లో హీరోగా మెప్పించాడు. అలా ఇప్పుడు సుహాస్ .. సత్య .. వైవా హర్ష వంటివారు కనిపిస్తున్నారు. 

తాజాగా ఆ జాబితాలోకి అభినవ్ గోమఠం చేరిపోయాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైనే అయింది. హీరోలకు స్నేహితుడిగా ఎక్కువ పాత్రలను చేసిన అభినవ్, కామెడీలో తనదైన స్టైల్ చూపిస్తూ వచ్చాడు. అలాంటి ఆయన ఇప్పుడు 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా!' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తిరుపతిరావు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రానుంది. చాలా తక్కువ పాత్రలతో .. లవ్ డ్రామా ప్రధానమైన కథాంశంగా ఈ సినిమా రూపొందిందని అభినవ్ చెప్పాడు. హీరోగానే చేయలని తాను అనుకోవడం లేదనీ, నచ్చిన పాత్రలు చేస్తూ వెళతానని అన్నాడు.  వైశాలి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. 

Abhinav Gomatam
Vaishali
Tarun Bhaskar
  • Loading...

More Telugu News