Mrunal Thakur: రష్మిక - దుల్కర్ గురించి మృణాళ్ చెప్పినమాట ఇదే!

Mrunal Thakur Special

  • 'సీతారామం'తో ఎంట్రీ ఇచ్చిన మృణాళ్ 
  • ఆ సినిమాతో పెరిగిపోయిన క్రేజ్ 
  • ఇక్కడ బిజీ అవుతున్న హీరోయిన్ 
  • త్వరలో పలకరించనున్న 'ఫ్యామిలీ స్టార్'  

మృణాల్ పేరు వినగానే అందరికీ కూడా 'సీతా రామం' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర కళ్లముందు కదలాడుతుంది. ఇటీవలే 'హాయ్ నాన్న' సినిమాలో నాని సరసన నటించిన ఆమె, త్వరలో విజయ్ దేవరకొండ సరసన నాయికగా, 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో పలకరించనుంది. 

తాజా ఇంటర్వ్యూలో మృణాళ్ మాట్లాడుతూ, 'సీతా రామం' సినిమా కోసం రష్మిక - దుల్కర్ లతో కలిసి పని చేశాను. ఒకరకంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్లిద్దరి నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. రష్మిక పాత్రలను ఎంచుకునే విధానం .. ఆ పాత్రలకు న్యాయం చేసే తీరు నాకు నచ్చుతుంది. ఆమె అలసిపోయినట్టుగా నేను చూడలేదు. ఎప్పుడు చూసినా అదే ఎనర్జీతో ఉండేది" అని అంది.

"ఇక దుల్కర్ గురించి చెప్పాలంటే తాను పెద్ద స్టార్ హీరోకి వారసుడు. అయినా ఆయన సెట్లో చాలా సింపుల్ గా ఉంటాడు. కథ నచ్చితే చాలు .. ఆయన ఏ భాషలోనైనా నటించడానికి వెనుకాడరు. సినిమా పట్ల ఆయనకి గల ప్యాషన్ కి ఇది ఒక నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్లిద్దరి ఆలోచనా విధానం నన్ను బాగానే ప్రభావితం చేసింది" అని చెప్పింది.

Mrunal Thakur
Rashmika Mandanna
Dulquer Salmaan
  • Loading...

More Telugu News