TSRTC: డ్రైవర్ కు బీపీ డౌన్.. ఏపీలో టీఎస్ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

Bus accident due to bus drivers BP down

  • విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సు
  • డ్రైవర్ భాస్కరరావుకు బీపీ డౌన్
  • ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు

ఏపీలోని కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రభుత్వం చోటు చేసుకుంది. టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కరరావుకు బీపీ డౌన్ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయారు. దీంతో, బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న కరెంట్ పోల్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

More Telugu News