Eagle: 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'ఈగల్'

Eagle movie Update

  • రవితేజ హీరోగా రూపొందిన 'ఈగల్' 
  • కథానాయికగా మెరిసిన కావ్య థాపర్
  • ముఖ్యమైన పాత్రలో కనిపించిన అనుపమ  
  • యాక్షన్ సీన్స్ ప్రధానంగా నడిచే సినిమా


రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'ఈగల్' సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుపమ పరమేశ్వరన్ ముఖ్యమైన పాత్రను పోషించింది.

తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. ఈగల్' సినిమా సోలోగానే థియేటర్లకు వచ్చింది. కొత్త లుక్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది.

తొలి రోజునే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత కూడా పోటీ ఇచ్చేంత స్థాయి సినిమాలు రాలేదు కూడా. అది కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా, ఎమోషన్స్ పరంగా కంటే యాక్షన్ పరంగానే కనెక్ట్ అయింది. 

More Telugu News