Ram Gopal Varma: 'వ్యూహం', 'శపథం' సినిమాలను టీడీపీ, జనసేన వాళ్లు చూస్తారా? అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇదే!

Ram Gopal Varma on Vyooham movie

  • వాళ్లు బాత్రూమ్ లలో కూర్చొని చూస్తారన్న వర్మ
  • ఈ సినిమాల్లో నిజాలను నగ్నంగా చూపించానని వెల్లడి
  • ఇష్టం ఉంటే చూడండి.. లేకపోతే మానేయండి అని వ్యాఖ్య

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం', 'శపథం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. వీడియోలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సింగ్ రింగ్ లోకి దిగిన వాళ్లు అవతలివాడిని గట్టిగా గుద్దాలని... నీ వెంట్రుకలు పీకుతా, బుగ్గ గిల్లుతా అని అంటే కుదరదని చెప్పారు. తన రెండు చిత్రాల్లో వాస్తవాలను గుడ్డలు విప్పి, నగ్నంగా చూపించానని అన్నారు. 

టీడీపీ, జనసేన వాళ్లు ఈ చిత్రాలను చూస్తారా అని కొందరు అడుగుతున్నారని... తాను పోర్న్ చూసే విధంగా... ఈ సినిమాను వాళ్లు బాత్రూమ్ లలో చూస్తారని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండేవాళ్లు పబ్లిక్ గా అందరితో పాటు లివింగ్ రూమ్ లో చూడొచ్చని అన్నారు. 'వ్యూహం' ఈ నెల 23న, 'శపథం' మార్చి 1న విడుదల అవుతున్నాయని చెప్పారు. ఈ సినిమాలను ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి అని అన్నారు. ఈ వీడియోను చంద్రబాబు, లోకేశ్, జగన్ లకు ట్యాగ్ చేశారు.

Ram Gopal Varma
Vyooham
Tollywood

More Telugu News