Harsha: గిరిజన గూడెంలో 'సుందరం మాస్టర్'గారి కామెడీ

Sundaram Master Movie Update

  • వైవా హర్ష హీరోగా 'సుందరం మాస్టర్'
  • కామెడీ టచ్ తో కూడిన కంటెంట్
  • ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 23వ తేదీన ఈ సినిమా రిలీజ్ 

'సుందరం మాస్టర్' .. వైవా హర్ష హీరోగా ఈ సినిమా టైటిల్ జనంలోకి బాగా దూసుకుని వెళ్లింది. అందుకు కారణం 'సుందరం మాస్టర్' అనే డైలాగ్ ఆల్రెడీ పాప్యులర్ కావడమే. వెంకటేశ్ హీరోగా చేసిన 'నమో వెంకటేశాయ' సినిమాలో హీరో తాగిన ప్రతిసారి, ఎదుటి వ్యక్తిని 'సుందరం మాస్టర్' అనుకుని చితగ్గొట్టేస్తూ ఉంటాడు. అందువలన 'సుందరం మాస్టర్' అనే డైలాగ్ వినగానే, ఆ సినిమా చూసినవాళ్లకి నవ్వొస్తుంది.

ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడం ప్లస్ అయింది. ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక అడవిలోని గిరిజన గూడెం ప్రజలకు ఆంగ్లాన్ని బోధించమని హీరోను పంపిస్తారు. అక్కడికి వెళ్లిన తరువాత, తనకంటే వాళ్లకే ఇంగ్లిష్ బాగా వచ్చనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలోనే కామెడీని వర్కౌట్ చేశారు.

గిరిజనులకు ఇంగ్లిష్ వచ్చు .. అయినా తనని అక్కడికి ఎందుకు పంపించారనేది అతనికి అర్థం కాదు. ఆ అడవిలో తనకి అర్థం కాని రహస్యమేదో ఉందనీ, తన ద్వారా సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం అతనికి అర్థమవుతుంది. అప్పుడతను ఏం చేస్తాడనేదే కథ. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

Harsha
Divya Sripada
Sundaram Master
  • Loading...

More Telugu News