Mahesh Babu: మహేశ్ బాబు అన్న కూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Hero Mahesh Babu Brothers Daughter Dance video viral

  • గుంటూరు కారం సినిమాలోని కుర్చీని మడతబెట్టి సాంగ్ కు డ్యాన్స్
  • పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా స్టెప్పులేసిన భారతి  
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో

ప్రముఖ హీరో మహేశ్ బాబు ఇటీవల 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో ‘కుర్చీని మడతబెట్టి..’ సాంగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందులో మహేశ్ బాబు డ్యాన్స్ కు థియేటర్లలో అభిమానులు కూడా మైమరిచి గంతులేశారు. తాజాగా ఈ పాటకు మహేశ్ బాబు అన్న కూతురు భారతి ఘట్టమనేని అదిరిపోయే స్టెప్పులేసింది.

ఇంట్లో కిచెన్ లో డ్యాన్స్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్ లా భారతి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇతరులు కూడా భారతి డ్యాన్స్ ‘వేరే లెవల్’ అంటున్నారు. భారతి ఎనర్జీ లెవల్స్ మామూలుగా లేవని, వీడియోను మళ్లీ మళ్లీ చూశామని కామెంట్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Bhar Ghats (@bharathighattamaneni)

More Telugu News