Pooja Hegde: ఇంతకుమించిన అందం ఇంకేముంటుంది? .. పూజ హెగ్డే లేటెస్ట్ పిక్స్!

Pooja Hegde Special

  • చీరకట్టులో మెరిసిన పూజ హెగ్డే
  • అందం .. ఆకర్షణ ఆమె సొంతం 
  • నాజూకుతనానికి నమూనా ఆమె
  • కనురెప్పలు అడ్డుగా భావించే కుర్రాళ్లు


పూజ హెగ్డే .. వెండితెరపై జారిపోయే నాజూకు సౌందర్యం. చక్కని కనుముక్కుతీరు .. కాడమల్లె పూవు లాంటి ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. పూజ హెగ్డే తన కెరియర్ ను ఆరంభించిన తరువాత స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఆమె  సినిమాలు చేస్తూ వెళ్లింది. ఒకానొక దశలో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో మెరిసింది. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమాలు వరుసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. అదే ఇంకొకరైతే డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవారు. కానీ పూజా మాత్రం లైట్ తీసుకుని తరువాత సినిమాల పనుల్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి వచ్చిన లేటెస్ట్ పిక్స్ కుర్రాళ్లను ఊరిస్తున్నాయి. ఊహాలోకంలో ఉత్సాహంతో పరుగులు పెట్టిస్తున్నాయి. ఆమెను చూడటానికి కనురెప్పలు కూడా అడ్డమేననేది కుర్రాళ్ల భావన.  ట్రెడిషనల్ లుక్ తో పూజ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఆమె ఎంచుకున్న శారీ కలర్ .. నాజూకు అల్లికలతో కూడిన ఆభరణాలు .. మరింత అందాన్ని ఆవిష్కరిస్తున్నాయి. మంచి హైటూ .. అందుకు తగిన ఫిజిక్ కారణంగా చీరకట్టులో పూజ మరింత ఆకర్షణీయంగా అనిపిస్తోంది. పూజను ఇలా చూస్తుంటే సంక్రాంతి .. దసరా .. దీపావళి మూడు పండుగలు ముంగిట్లోకి వచ్చి నిలుచున్నట్టుగా లేదూ! 

More Telugu News