Aishwarya Shankar: మళ్లీ పెళ్లి చేసుకుంటున్న దర్శకుడు శంకర్ కుమార్తె... వరుడు ఎవరంటే...!

Shankar daughter Aishwarya will be getting married again
  • 2021లో క్రికెటర్ రోహిత్ దామోదర్ ను పెళ్లాడిన ఐశ్వర్య శంకర్
  • రోహిత్ పై పోక్సో కేసు
  • విడాకులు తీసుకున్న ఐశ్వర్య
  • తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్ తో నిశ్చితార్థం
  • త్వరలో పెళ్లి
దక్షిణాది సూపర్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె డాక్టర్ ఐశ్వర్య శంకర్ రెండో పెళ్లి చేసుకుంటోంది. తమిళ చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తరుణ్ కార్తికేయన్ ను ఐశ్వర్య పెళ్లాడనుంది. ఐశ్వర్య-తరుణ్ కార్తికేయన్ ల నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. 

ఐశ్వర్య శంకర్ కు 2021లో క్రికెట్ ప్లేయర్ రోహిత్ దామోదరన్ తో వివాహం జరిగింది. రోహిత్ కు ఓ క్రికెట్ అకాడమీ ఉంది. అందులో శిక్షణ పొందుతున్న మహిళా క్రికెటర్లతో  రోహిత్ దామోదరన్  అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు రావడమే కాదు, అతడిపై పోక్సో కేసు కూడా నమోదైంది. 

అప్పటి నుంచి ఐశ్వర్య, రోహిత్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. కొన్నాళ్లకే శంకర్ కుమార్తె విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శంకర్ చిన్న కుమార్తె అదితి వెల్లడించింది. తరుణ్ కార్తికేయన్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు, లిరిక్ రైటర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా.
Aishwarya Shankar
Wedding
Assistant Director
Tarun Kartikeyan
Shankar
Kollywood

More Telugu News