Geethamadhuri: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. ఇన్ స్టాలో సింగర్ పోస్టు వైరల్

Singer Geethamadhuri Blessed Baby Boy On 10th Febraury

  • ఈ నెల 10న బాబు పుట్టినట్లు తాజాగా కన్ఫాం చేసిన గీతామాధురి
  • 2014 లో గీతామాధురి, నందుల ప్రేమ వివాహం
  • 2019లో పాపకు జన్మనిచ్చిన సింగర్

ప్రముఖ గాయని గీతామాధురి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 10న తమకు కొడుకు పుట్టాడంటూ గీతామాధురి భర్త, సింగర్, నటుడు నందు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నాడు. రెండో బిడ్డ పుట్టడంతో గీతామాధురి ఇంట్లో సంబరాలు మిన్నంటగా.. సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. గీతామాధురి సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో సుమారు 800 మందికి గీతామాధురి, నందు అన్నదానం చేశారు. నందు స్వయంగా వంటకాలను తయారుచేయించి వడ్డించారు.

కొంతకాలంగా గీతామాధురి పాటలకు దూరమైంది. ఈ విషయంపై యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరగడంతో కిందటి నెల గీతామాధురి వివరణ ఇచ్చింది. దాక్షాయణి ప్రకృతి (తన కూతురు) అక్క కాబోతోందంటూ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ప్రెగ్నెన్సీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవల జరిగిన తన సీమంతం ఫొటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. తాజాగా తనకు కొడుకు పుట్టినట్లు పోస్ట్ చేసింది. నందు, గీతామాధురి ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. 2019లో ఈ దంపతులకు పాప పుట్టింది. పాపకు దాక్షాయణి ప్రకృతి అంటూ నామకరణం చేశారు.

Geethamadhuri
Pregnancy
Baby Boy
Insta Post
Nandu
Tollywood
Viral News
  • Loading...

More Telugu News