YS Sharmila: జోథ్ పూర్ లో రాజారెడ్డి-ప్రియా హల్దీ వేడుక... ఫొటోలు పంచుకున్న షర్మిల

Sharmila shares her son Raja Reddy and Priya Atluri Haldi celebration photos

  • జోథ్ పూర్ లో షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహ వేడుకలు
  • ఈ నెల 16 నుంచి 18 వరకు పెళ్లి వేడుకలు
  • ఆకట్టుకుంటున్న రాజారెడ్డి-ప్రియా అట్లూరి ఫొటోలు

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం జోథ్ పూర్ లో నేడు జరగనుంది. షర్మిల తన కుమారుడి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ రాజా-ప్రియా అంటూ ట్వీట్ చేశారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటూ దీవించారు. 

కాగా హల్దీ వేడుకల్లో షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల కుమార్తె అంజలి రెడ్డి, వైఎస్ విజయమ్మ, ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. కాగా, వీరి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఈ నెల 16 నుంచి 18 వరకు మూడ్రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.

More Telugu News