Harish Rao: మాపై బురద చల్లేందుకే శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు: హరీశ్ రావు

Harish Rao fires on TS Govt

  • పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో అన్నీ అబద్ధాలే చెప్పారన్న హరీశ్
  • ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులను తామే పూర్తి చేశామన్న హరీశ్
  • మేడిగడ్డకు వెంటనే రిపేర్లు చేయించాలని డిమాండ్

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అన్నీ అసత్యాలే చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారని అన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయ్యాయనేది అసత్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిడ్ మానేరుకు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే.. తాము వచ్చాక రూ. 775 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చామని అన్నారు. 

కావాలనే మేడిగడ్డ ప్రాజెక్ట్ మరమ్మతులను ఆలస్యం చేస్తున్నారని హరీశ్ విమర్శించారు. అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమని తాము ఇప్పటికే చెప్పామని అన్నారు. తమపై ఉన్న కోపంతో ప్రజలను అన్యాయం చేయొద్దని కోరారు. వర్షాలు పడేలోగా రిపేర్లు చేయించాలని కోరారు. ప్రాణహిత చేవెళ్లను తాము మార్చాలనుకోలేదని... ఇంజినీరింగ్ అధికారులు చెప్పినందుకే రీడిజైనింగ్ చేశామని చెప్పారు.

Harish Rao
BRS
Uttam Kumar Reddy
Congress
Kaleshwaram Project
Medigadda Barrage
Telangana
  • Loading...

More Telugu News