Devara: ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం

NTR Devara release date announced

  • ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో దేవర
  • ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాణం
  • ఈ ఏడాది అక్టోబరు 10న గ్రాండ్ రిలీజ్

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ మూవీ దేవర ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం నేడు దేవర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. "భయంతో వణికించడంలో రారాజు... కట్లు తెంచుకున్న రాకాసి అలలా దూకేందుకు 2024 అక్టోబరు 10న వస్తున్నాడు" అంటూ దేవర టీమ్ వెల్లడించింది. 

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ కథానాయిక. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేవర కోసం అభిమానులు తహతహలాడుతున్నారు.

Devara
Release Date
Junior NTR
Koratala Siva
Tollywood
  • Loading...

More Telugu News