Congress: కాంగ్రెస్‌లో చేరిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బొంతు రామ్మోహన్

- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ
- హస్తం గూటికి చేరుకున్న సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
- నిన్న కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం కండువాను కప్పుకున్నారు. ఈరోజు ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలువురు నాయకులు ఈ పార్టీలో చేరుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం నాయకుడు నీలం మధు ముదిరాజ్ బీఎస్పీకి రాజీనామా చేసి నిన్న కాంగ్రెస్‌లో చేరారు.
