Chiranjeevi: లాస్ ఏంజెల్స్ లో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్

Producer TG Vishwa Prasad met Chiranjeevi in LA

  • ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న చిరంజీవి
  • షూటింగ్ బ్రేక్ లభించడంతో అర్ధాంగి సురేఖతో కలిసి అమెరికాలో విహారయాత్ర
  • ఇటీవల చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
  • చిరంజీవిని ఘనంగా సత్కరించాలని నిర్మాత విశ్వప్రసాద్ నిర్ణయం
  • ఓకే చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సతీసమేతంగా అమెరికా విహారయాత్రలో ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్న చిరంజీవి షూటింగ్ విరామం లభించడంతో అమెరికా వెళ్లారు. 

కాగా, లాస్ ఏంజెల్స్ నగరంలో చిరంజీవిని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిశారు. ఇటీవల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని ఘనంగా సత్కరించేందుకు ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. 

ఈ సన్మాన కార్యక్రమం గురించి చిరంజీవికి చెప్పగా, ఆయన అందుకు అంగీకరించారని టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. త్వరలోనే ఈ మెగా సన్మాన కార్యక్రమం వివరాలు ప్రకటించనున్నారు.

More Telugu News