Vidhvansam Book: 'విధ్వంసం' పుస్తకావిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

- విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ
- వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ పుస్తకం రచన
- ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు
సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ ‘విధ్వసం’ పుస్తకాన్ని రచించారు. మొత్తం 185 అంశాలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు.


