Hyderabad: మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదు

  • మలక్‌పేట ఎమ్మెల్యేతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటరమణ పైనా కేసు
  • భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకొని మోసం చేశారని యాదగిరి అనే వ్యక్తి ఫిర్యాదు
  • తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలన్న యాదగిరి
  • తనకు కోటి మాత్రమే ఇచ్చారని... మిగిలిన మొత్తం ఇవ్వాలని సీసీఎస్‌లో ఫిర్యాదు

మలక్‌పేట ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదయింది. ఆయనతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ పైనా కేసు నమోదయింది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని వెంకటరమణ  రూ.7 కోట్లు తీసుకొని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.7 కోట్లకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. విడతల వారీగా రూ.4 కోట్లు, రూ.3 కోట్లు చెల్లించినట్లు బాధితుడు పోలీసులకు చెప్పారు. 

అయితే న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని న్యాయవాది వెంకటరమణను... యాదగిరి కోరారు. తనకు రూ.1 కోటి మాత్రమే ఇచ్చారని... మిగిలిన మొత్తం ఇవ్వకుండా మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, మరో వ్యక్తితో కలిసి బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా ముగ్గురిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News