Vaiva Harsha: మెగా చేతుల మీదుగా 'సుందరం మాస్టర్' ట్రైలర్ రిలీజ్!

- వైవా హర్ష హీరోగా 'సుందరం మాస్టర్'
- ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ
- ఒక వైపున కామెడీ .. మరో వైపున సస్పెన్స్
- ఈ నెల 23వ తేదీన ఈ సినిమా విడుదల
కమెడియన్ గా వైవా హర్ష తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. 'సుందరం మాస్టర్' సినిమాతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి హీరో రవితేజ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దర్శకుడిగా కల్యాణ్ సంతోష్ పరిచయమవుతున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ మెగాస్టార్ చేతుల మీదుగా విడుదలైంది.
అడవి ప్రాంతంలోకి ఒక గిరిజన గూడెంలోని ప్రజలకు ఆంగ్లం నేర్పించమని హీరోను ఆ ప్రాంతానికి పంపిస్తారు. అక్కడి వారికి తనకంటే మంచి ఇంగ్లిష్ వచ్చని తెలిసి హీరో ఆశ్చర్యపోతాడు. అసలు తనని పంపించింది మాస్టర్ గా కాదనీ, అక్కడ దాగిన ఒక రహస్యాన్ని కనిపెట్టడం కోసమని హీరోకి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.
