Satendra Siwal: పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌గా భారత ఎంబసీ ఉద్యోగి.. అలా మారడం వెనకున్న అసలు కథ ఇదీ!

Indian embassy employee Satendra Siwal Falls Victim To Honey Trap

  • ‘పూజా మెహ్రా’ అనే అమ్మాయితో సోషల్ మీడియాలో పరిచయం
  • పూజా సోషల్ మీడియా ఖాతాను ఆపరేట్ చేస్తున్న పాక్ ఐఎస్ఐ
  • సివాల్ హనీట్రాప్ వలలో చిక్కుకున్నట్టు నిర్దారించిన ఏటీఎస్
  • ఈ నెల 4న లక్నోలో అరెస్ట్

మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తూ పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి ఏజెంట్‌‌గా మారిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సతేంద్ర సివాల్‌ను ఇటీవల ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సివాల్ పాక్‌ ఐఎస్‌ఐకి ఏజెంట్‌గా మారడం వెనక గల కారణాన్ని ఏటీఎస్ ఇన్‌స్పెక్టర్ రాజీవ్ త్యాగి వెల్లడించారు. ‘పూజా మెహ్రా’ అనే పేరుగల అమ్మాయి హనీట్రాప్‌లో చిక్కుకోవడం వల్లే సివాల్ అలా మారాడని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె అతడికి పరిచయం అయినట్టు తెలిపారు. 

పూజా మెహ్రా హనీట్రాప్‌లో చిక్కుకున్న సివాల్ భారత వాయుసేన, నేవీ ఆయుధ వ్యవస్థ వంటి కీలక సమాచారాన్ని ఆమెకు అందించాడు. అయితే, సివాల్ మాత్రం డాక్యుమెంట్లు ఇంకా తన ఫోన్‌లోనే ఉన్నాయని చెప్పడంతో అతడి స్టేట్‌మెంట్‌ను నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు అతడి ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తున్నారు. పూజా మెహ్రా సోషల్ మీడియా సోషల్ మీడియా ఖాతా పాకిస్థాన్ ఐఎస్ఐ ఆపరేట్ చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. 

సివాల్ 2021లో మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో ఇండియా బేస్‌డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఐబీఎస్ఏ)గా చేరాడు. ఐఎస్‌ఐకి అనుకూలంగా పనిచేస్తూ భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఆరోపణలపై అతడిపై పలు రకాలుగా నిఘా పెట్టిన ఏటీఎస్ ఈ నెల 4న లక్నోలో అదుపులోకి తీసుకుంది.

More Telugu News