Priyadarshi: హాట్ స్టార్ లో అడుగుపెడుతున్న 'సేవ్ ది టైగర్స్ 2'

Save The Tigers 2 Series Update

  • ఓటీటీలో ఆకట్టుకున్న 'సేవ్ ది టైగెర్స్'
  • భార్య బాధితులైన ముగ్గురు ఫ్రెండ్స్ కథ
  • నాన్ స్టాప్ కామెడీతో నడిచే సిరీస్   
  • త్వరలో పలకరించనున్న సీజన్ 2


హాట్ స్టార్ లో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ లలో 'సేవ్ ది టైగర్స్' ఒకటి. క్రితం ఏడాది ఏప్రిల్ లో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రియదర్శి - అభినవ్ గోమటం - కృష్ణ చైతన్య ప్రధానమైన పాత్రలను పోషించారు. వారి భార్యల పాత్రలలో సుజాత - దేవయాని - పావని గంగిరెడ్డి నటించారు. 
 
కథానాయకులు ముగ్గురూ స్నేహితులు. ఒక్కొక్కరూ ఒక్కో ఫీల్డ్ కి సంబంధించినవారు. ముగ్గురూ కూడా భార్యా బాధితులే. అదే పనిగా భార్యలు నస పెడుతూ ఉండటంతో, ముగ్గురూ కూడా సహనం కోల్పోతారు. ఫలితంగా ముగ్గురి కాపురాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిమాణాలు చోటుచేసుకోనున్నాయనేది సీజన్ 2లో చూపించనున్నారు. 

'సేవ్ ది టైగర్స్' సీజన్ 2 ను త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ముగ్గురు కథానాయకులు జైల్లో ఉండటం పోస్టర్ లో కనిపిస్తోంది. పూర్తిగా కామెడీ టచ్ తో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా నడిచే కథ ఇది. ముగ్గురు కాపురాల్లోని కలహాలు ఏ స్థాయికి వెళ్లాయనే అంశంపై ఫోకస్ చేస్తూ, సీజన్ 2 నవ్వించనుందన్న మాట. 

Priyadarshi
Abhinav Gomatham
Krishna Chaithanya
  • Loading...

More Telugu News