Tillu Square: టిల్లు అన్న మళ్లీ వస్తున్నాడు... 'టిల్లు స్క్వేర్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Theatrical trailer from Tillu Square out now

  • సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా టిల్లు స్క్వేర్
  • ఘాటైన కిస్సింగ్ సీన్ తో తాజా ట్రైలర్
  • మల్లిక్ రామ్ దర్శకత్వంలో చిత్రం
  • మార్చి 29న వరల్డ్ వైడ్ రిలీజ్

డీజే టిల్లుతో హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి టిల్లు స్క్వేర్ తో పలకరించడానికి వస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. 

తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. వినోదానికి పెద్దపీట వేసిన ఈ చిత్రంలో ఘాటైన ముద్దు సీన్ కూడా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కార్లో సిద్ధు, అనుపమ మధ్య రొమాంటిక్ సీన్ ను ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. 

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సినిమాకు ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు.

More Telugu News