Kodali Nani: పవన్ కల్యాణ్ పై కొడాలి నాని సెటైర్లు

Kodali Nani satires on Pawan Kalyan

  • పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా
  • హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరణ
  • మంగళగిరిలోనే ఉండిపోయిన జనసేనాని
  • ఏం... కార్లో వెళ్లలేడా అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు
  • ఎమ్మెల్యేగారికి హెలికాప్టర్ కావాలా? అంటూ వ్యంగ్యం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదంటూ భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. 

"ఆయన విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. భీమవరంలోని విష్ణు కాలేజీలో బిల్డింగ్ ల మధ్య హెలికాప్టర్ తో దిగుతాడంట. ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్, ఫైర్ డిపార్ట్ మెంట్ వాళ్లు వెళ్లి... బిల్డింగ్ ల మధ్య హెలికాప్టర్ దిగేటప్పుడు రెక్క తగిలితే ప్రమాదం కలుగుతుంది... ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది... మేమేదో చేశాం అంటారు... అందుకే ఇక్కడ కాకుండా ఊరి బయట ఎక్కడైనా దిగి ఊర్లోకి రమ్మని చెప్పారు. కానీ, నాకు ఇక్కడే అనుమతి కావాలి, లేకపోతే నేను భీమవరం వెళ్లనంటూ ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. 

జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అని అడుగుతారు, పార్టీ నేతలు కూడా ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అని అడుగుతారు, మీడియా వాళ్లకు కూడా సమాధానం చెప్పాలి. వాళ్లు అడిగిన దానికి ఈయన సమాధానం చెప్పాలి. ఈయన సమాధానం చెప్పాలంటే ఢిల్లీ వాళ్లు చెప్పాలి. ఇవన్నీ తప్పించుకోవడానికి పర్యటనలు వాయిదా వేసుకుంటున్నారు. 

నిన్నటి నుంచి చూస్తున్నా... విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి ఎంత సేపు పడుతుంది? కార్లో గంటన్నరలో వెళ్లిపోవచ్చు. హెలికాప్టర్ లోనే వెళ్లాలా? హెలికాప్టర్ ల్యాండ్ కాకపోతే ఈయన వెళ్లడా? భీమవరంలో పోటీ చేసేట్టయితే, ప్రతిసారి హెలికాప్టర్ ఉంటేనే అక్కడకు వెళతాడా? ఇది భీమవరం ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. మీ ఎమ్మెల్యేగారు హెలికాప్టర్ లేకపోతే రాలేడంట. కనీసం ఊరి బయట కూడా దిగడంట... ఊర్లోనే బిల్డింగుల మీద దిగుతాడంట" అంటూ కొడాలి నాని వ్యంగ్యం ప్రదర్శించారు.

Kodali Nani
Pawan Kalyan
Helicopter
Bhimavaram
YSRCP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News