Telangana: సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారా ఉద్యోగులకు రేపు ప్రత్యేక సెలవు

Telangana Government gave leave for Banjaras on Sant Sevalal jayanthi

  • ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న బంజారాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త 
  • క్యాజువల్ లీవ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వుల జారీ
  • ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు క్యాజువల్ లీవ్ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న బంజారాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది! రేపు ప్రత్యేక క్యాజువల్ లీవ్‌ను ప్రకటించింది. గురువారం సేవాలాల్ జ‌యంతి సంద‌ర్భంగా క్యాజువ‌ల్ లీవ్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు క్యాజువ‌ల్ లీవ్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్‌లో జన్మించారని బంజారాల విశ్వాసం. ఆయన సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. జగదాంబకు అత్యంత ప్రియ భక్తుడు. బంజారాల హక్కులు, నిజాం, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్‌ సేవాలాల్‌ పాత్ర కీలకం.

  • Loading...

More Telugu News