Chandrababu: జగన్ అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోడానికి అబద్ధాల సాక్షి సరిపోవట్లేదు: చంద్రబాబు

Chandrababu shares Nara Lokesh comments video
  • పార్వతీపురంలో శంఖారావం సభ
  • యాత్ర-2 సినిమాపై నారా లోకేశ్ వ్యాఖ్యలు
  • లోకేశ్ వ్యాఖ్యల క్లిప్పింగ్ ను పంచుకున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్వతీపురం శంఖారావం సభలో మాట్లాడిన క్లిప్పింగ్ ను పార్టీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. యాత్ర-2 సినిమాపై లోకేశ్ వ్యాఖ్యానించడం ఈ క్లిప్పింగ్ లో చూడొచ్చు. 

ఈ వీడియోపై చంద్రబాబు స్పందిస్తూ... జగన్ అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాల సాక్షి సరిపోవడంలేదని విమర్శించారు. వందల కోట్ల ప్రజల సొమ్ము తగలేసి సాక్షిలో ఇస్తున్న అసత్య ప్రకటనలు సరిపోవట్లేదని, అందుకే సినిమాలు తీయిస్తున్నాడని ఆరోపించారు. 

అయితే ఆ సినిమాలను ప్రజలు ఆదరించకపోయేసరికి నిర్మాతలు మునిగిపోయారని, వాళ్ల కోసం ఇప్పుడు హార్సిలీ హిల్స్ లో కోట్ల ఖరీదు చేసే భూముల్ని ధారదత్తం చేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు.

"ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నావు. నీ సినిమాల కోసం ప్రజల భూములను పంచేస్తావా? అందుకే... నువ్వు యాత్ర అని సినిమా తీస్తే ప్రజలు నీ పార్టీకి అంతిమయాత్ర ప్లాన్ చేశారు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Nara Lokesh
Jagan
Yatra-2
Shankharavam
Parvathipuram
TDP
YSRCP

More Telugu News