Srimanthudu: 'శ్రీమంతుడు' నా కథకు కాపీ అని అప్పుడే తెలిసింది: రచయిత శరత్ చంద్ర

Sharath Chandra Interview

  • కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు'
  • 2015లో విడుదలై విజయం సాధించిన సినిమా 
  • అది తన కథకు కాపీ అన్న శరత్ చంద్ర
  • కొరటాల పెద్దగా స్పందించలేదని వెల్లడి  


కొరటాల శివ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'శ్రీమంతుడు' సినిమా భారీ విజయాన్ని సాధించింది. 2015 ఆగస్టు 7వ తేదీన విడుదలైన ఈ సినిమా, మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన కథగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. అయితే ఈ కథ తనదంటూ అప్పట్లోనే రచయిత శరత్ చంద్ర మీడియా ముందుకు వచ్చారు. 

అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం ముదురుతూ వచ్చింది. తాజాగా ఈ వివాదాన్ని గురించి 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ చంద్ర మాట్లాడారు. " నేను రాసుకున్న 'చచ్చేంత ప్రేమ' అనే కథ, 2012లో 'స్వాతి'లో పబ్లిష్ అయింది. వి. సముద్ర దర్శకత్వంలో నారా రోహిత్ తో ఈ కథను సినిమాగా చేయాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ సమయంలోనే 'శ్రీమంతుడు' సినిమా విడుదలైంది' అని అన్నారు. 

'శ్రీమంతుడు' చూసిన నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి, అది నా కథ మాదిరిగానే ఉందని చెప్పాడు. అప్పుడు ఆ సినిమా చూసిన నాకు .. అది నా కథకి కాపీ అనే విషయం అర్థమైంది. ఆ విషయం గురించి నేను కొరటాల శివ గారికి కాల్ చేసి మాట్లాడాను. నేను రాసిన కథను ఒకసారి చదవమని ఆయనకి పంపించాను. ఆయన వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందువల్లనే కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది" అని చెప్పారు.

Srimanthudu
Koratala Siva
Mahesh Babu
Sharath Chandra
  • Loading...

More Telugu News