Nara Lokesh: కురుపాం సభలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన నారా లోకేశ్

Nara Lokesh mentions Red Book in Kurupam

  • కురుపాం శంఖారావం సభకు హాజరైన లోకేశ్
  • చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని వెల్లడి
  • తాము అధికారంలోకి వచ్చాక న్యాయ విచారణ చేపడతామని స్పష్టీకరణ

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ చేతిలో కనిపించిన రెడ్ బుక్ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రస్తుత ఉత్తరాంధ్రలో లోకేశ్ చేపడుతున్న శంఖారావం సభలో పలుమార్లు లోకేశ్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఈ సాయంత్రం కురుపాం సభలోనూ లోకేశ్ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. 

చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో ఉన్నవారిపై న్యాయ విచారణ చేపడతాం అని తెలిపారు. ఎర్ర బుక్ అంటే వైసీపీ నేతలు ఉచ్చ పోసుకుంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. 

"ఊరూరా లోకేశ్ ఎర్ర బుక్ చూపిస్తున్నాడని నాపై కోర్టుకు వెళ్లారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి అని కోర్టుకెక్కారు. అరే... వారెంట్ ఎందుకయ్యా... నేను ఇక్కడే ఉన్నాను కదా... మీ జగన్ లాగా బెయిల్ తీసుకుని భయపడే వ్యక్తిని కాను. దమ్ము ధైర్యం గల వ్యక్తిని నేను. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ నేను ప్రజల మధ్యకు వచ్చాను" అని స్పష్టం చేశారు. 

అరాచకాలకు ఎదురొడ్డి పోరాడుతున్న కొందరు కార్యకర్తలపై రౌడీషీట్లు తెరిచారని, తాము అధికారంలోకి వచ్చాక కోర్టుకు వెళ్లి ఆ రౌడీషీట్లు ఎత్తేసే బాధ్యత నాది అని సభా ముఖంగా హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News