Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటన కోసం హెలికాప్టర్ సిద్ధం!

Pawan Kalyan set to use Helicopter for election campiagn
  • ఏపీలో త్వరలో ఎన్నికలు
  • అన్ని జిల్లాల్లో పర్యటించాలని పవన్ నిర్ణయం
  • ప్రతి జిల్లాకు కనీసం మూడు సార్లు వెళ్లాలని భావిస్తున్న జనసేనాని
  • 175 సెగ్మెంట్లలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాల గుర్తింపు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు ఈ పర్యటన సాగనుంది. ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని జనసేనాని నిర్ణయించుకున్నారు. 

అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలన్నది పవన్ ప్రణాళికగా తెలుస్తోంది. అందుకోసం హెలికాప్టర్ ను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో హెలిప్యాడ్లకు అనువైన ప్రదేశాలను జనసేన శ్రేణులు పరిశీలిస్తున్నాయి. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాకు కనీసం మూడు సార్లు వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో, భీమవరం సభకు పవన్ హెలికాప్టర్ లో రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక నేతలు భీమవరంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు.
Pawan Kalyan
Helicopter
Election Campaign
Janasena
Andhra Pradesh

More Telugu News