PV Sindhu: సినీ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బ్యాడ్మింటన్ భామ

PV Sindhu opines on cinemas and heroes

  • బ్యాడ్మింటన్ లోనూ ఒత్తిడి ఉంటుందన్న సింధు
  • ఒత్తిడి తగ్గించుకునేందుకు సినిమాలు చూస్తుంటానని వెల్లడి
  • రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ల యాక్టింగ్ నచ్చుతుందని వ్యాఖ్యలు
  • హీరోల కష్టాన్ని తేలిగ్గా తీసిపారేయకూడదని పిలుపు 

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలుగు సినిమాలు, హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ సింధు మాట్లాడుతూ... అన్ని క్రీడల్లాగే బ్యాడ్మింటన్ కూడా ఒత్తిడితో కూడుకున్న క్రీడ అని తెలిపింది. అందుకే ఆటలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవడానికి సినిమాలు చూస్తుంటానని వెల్లడించింది. 

రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ల నటనను ఎంతో ఇష్టపడతానని... విజయ్ దేవరకొండ తీసిన సినిమాల్లో కొన్ని నచ్చుతాయని సింధు పేర్కొంది. 

హీరోల కష్టాన్ని తేలిగ్గా తీసిపారేయకూడదని అభిప్రాయపడింది. హీరోలు ఒక సినిమా కోసం ఎంతో కష్టపడతారని, కానీ సినిమా ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని అభిప్రాయపడింది. తమ సినిమాలు విజయవంతం కావాలని వారు నెలల తరబడి షూటింగ్ లో పాల్గొంటారని, అంతిమంగా సినిమా సక్సెస్ అయితేనే వారి కష్టానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.

PV Sindhu
Heroes
Cinemas
Badminton
Tollywood
  • Loading...

More Telugu News