YV Subba Reddy: హైదరాబాద్ ను మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy says Hyderabad will continue as joint capital

  • 2014లో రాష్ట్ర విభజన
  • పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
  • హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు పొడిగించాలని వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్ష
  • రాష్ట్రానికి మేలు జరుగుతుందని వెల్లడి 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి పదేళ్లు కావస్తోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడా గడువు కూడా పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్ర్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితేనే బాగుంటుందని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఎన్నికలు ముగిశాక సీఎం, వైసీపీ నాయకత్వం దీనిపై చర్చిస్తారని వెల్లడించారు. రాజధాని కట్టకుండా ఐదేళ్ల పాటు తాత్కాలికం పేరుతో టీడీపీ కాలయాపన చేసిందని విమర్శించారు.

More Telugu News