Ram Charan: రామ్ చరణ్ కొత్త లుక్కు... ఫొటోలు ఇవిగో!

Ram Charan with new hair style

  • ట్రెండీ హెయిర్ కట్ తో రామ్ చరణ్
  • చరణ్ కు కొత్త లుక్ ఇచ్చిన ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ అలిమ్ హకీమ్ 
  • ఆకట్టుకుంటున్న ఫొటోలు 

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టయిల్ మార్చారు. సరికొత్త హెయిర్ స్టయిల్ తో ఉన్న రామ్ చరణ్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుందనడంలో సందేహంలేదు. సెలెబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ అలిమ్ హకీమ్ తాజాగా రామ్ చరణ్ తలకట్టును అందంగా తీర్చిదిద్దారు. 

దేశంలో ఇప్పుడున్న యువ హీరోల్లో రామ్ చరణ్ కు ఫ్యాషన్ ఐకాన్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ట్రెండీ హెయిర్ కట్ తో ఆ విషయాన్ని రామ్ చరణ్ మరోసారి నిరూపించుకున్నారు. 

ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కబోయే చిత్రంలో నటించనున్నారు.

Ram Charan
New Look
Hair Style
Alim Hakeem
Tollywood
  • Loading...

More Telugu News