Ashok Chavan: మరికాసేపట్లో బీజేపీ గూటికి కాంగ్రెస్ మాజీ నేత అశోక్ చవాన్!

Ashok Chavan To Join BJP Today

  • మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీజేపీలో చేరిక
  • ప్రకటించిన ముంబై బీజేపీ కార్యాలయం
  • పార్టీని వీడాలన్నది తన వ్యక్తిగత నిర్ణయమన్న అశోక్ చవాన్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన బీజేపీలో చేరుతారని ముంబై బీజేపీ కార్యాలయం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చవాన్ బీజేపీలో చేరుతారన్న ఊహగానాలు మొదలయ్యాయి. అవి నేడు నిజం కాబోతున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా తర్వాత బీజేపీలో చేరబోతున్నారా? అన్న ప్రశ్నకు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని నిన్న ప్రకటించిన చవాన్.. తాజాగా కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. 

ఇదిలావుంచితే, మహరాష్ట్రలో కాంగ్రెస్‌కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. సీనియర్ నేతలు బాబా సిద్దిఖీ, మిలింద్ డియోరా వంటివ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు అశోక్ చవాన్ కూడా వెళ్లిపోవడం మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా, పార్టీని వీడాలన్న నిర్ణయం తన వ్యక్తిగతమని అశోక్ చవాన్ తెలిపారు.

Ashok Chavan
Maharashtra
Congress
BJP
  • Loading...

More Telugu News