Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు

Kesineni Nani satires on Chandrababu

  • చంద్రబాబు స్పెషల్ ఫ్లయిట్ లో ఢిల్లీ వచ్చేవాడని కేశినేని నాని వెల్లడి
  • మాది పేద రాష్ట్రం... డబ్బులు కావాలి అని ప్రధానిని అడిగేవాడని వివరణ
  • ప్రధాని రియాక్షన్ ఎలా ఉండేదో వెల్లడించిన కేశినేని నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో తాను దగ్గర్నుంచి చూశానని కేశినేని నాని వెల్లడించారు. 

"చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఇంట్లోంచి బయటికి వచ్చేవాడు. ఇంటి ఎదురుగానే హెలిప్యాడ్ ఉండేది. అక్కడివరకు బుల్లెట్ ప్రూఫ్ కార్లో వచ్చి, హెలిప్యాడ్ లో ఉన్న హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లేవాడు. అక్కడ్నించి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేవాడు. 

ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి... మా రాష్ట్రం పరిస్థితి బాగా లేదు.. డబ్బులు కావాలి అని అడిగేవాడు. చంద్రబాబు ఇటు తిరగ్గానే ఆయన (ప్రధాని) మాతో చెప్పేవాడు... ఆయన ఇంటి ముందు హెలికాప్టర్ ఎక్కి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగి, అక్కడ్నించి స్పెషల్ ఫ్లయిట్ ఎక్కి ఇక్కడికి వచ్చి మా రాష్ట్రం పేదది అంటాడేంటి అనేవారు. మమతా బెనర్జీ రబ్బరు చెప్పులు వేసుకుని, రూ.100 చీర కట్టుకుని మామూలు విమానంలో వస్తుంది... శాంట్రో కారులో తిరుగుతుంది. వాళ్ల రాష్ట్రం పేదది అంటే ఎవరైనా నమ్ముతారు కానీ, మీ ముఖ్యమంత్రిని చూసి పేద రాష్ట్రం అంటే ఎలా నమ్ముతాం అనేవారు. ఆయనదంతా హైప్... ఈయనది (జగన్ ది) రియాలిటీ" అని కేశినేని వ్యాఖ్యానించారు.

Kesineni Nani
Chandrababu
New Delhi
YSRCP
TDP
Vijayawada

More Telugu News