US citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు దక్కిన అమెరికా పౌరసత్వం

59100 Indians has got US citizenship In 2023 says reports
  • అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికన్లకు లభించిన సిటిజన్‌షిప్
  • 2023లో మొత్తం 8.7 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చిన యూఎస్ఏ
  • రిపోర్ట్ విడుదల చేసిన ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ ఏజెన్సీ
అమెరికా పౌరసత్వాన్ని పొందాలని అక్కడ నివాసముంటున్న విదేశీయులు ఆశిస్తుంటారు. కానీ అర్హత ఉన్న కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. గతేడాది 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికో పౌరులు అమెరికా పౌరసత్వాన్ని పొంది టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. ఈ మేరకు 2023 వార్షిక నివేదికను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇటీవల రిపోర్ట్ విడుదల చేసింది.

2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరులుగా మారారని, మెక్సికన్లు 12.7 శాతం, భారతీయులు 6.7 శాతంగా ఉన్నారని రిపోర్ట్ వెల్లడించింది. ఫిలిప్పీన్స్ పౌరులు 44,800 (5.1 శాతం), డొమినికన్ రిపబ్లిక్ పౌరులు 35,200 (4 శాతం) ఉన్నారని తెలిపింది. దరఖాస్తుదారుడు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటి యాక్ట్ (INA) నిబంధనలకు అర్హత సాధిస్తే మాత్రమే పౌరసత్వం లభిస్తుందని వెల్లడించింది.

అమెరికాలో కనీసం ఐదేళ్లపాటు చట్టబద్ధ నివాసం, అమెరికా పౌరులను జీవిత భాగస్వామిగా కలిగివుండడం, మిలిటరీ సేవలో ఉండడంతో పాటు పలు సాధారణ నిబంధనలు పౌరసత్వాన్ని పొందేందుకు అర్హతలుగా ఉన్నాయని యూఎస్‌సీఐఎస్ రిపోర్ట్ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2023లో అమెరికా పౌరసత్వం పొందినవారిలో చాలా మంది కనీసం 5 ఏళ్లు చట్టబద్ధ నివాసం ద్వారా అర్హత పొందినవారే ఉన్నారని స్పష్టం చేసింది. కాగా అమెరికన్ పౌరులను పెళ్లి చేసుకున్నవారికి మూడేళ్లలోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
US citizenship
Indians
NRIs
USCIS
USA

More Telugu News