Allu Arjun: కారు టైర్లపై తన సిగ్నేచర్‌ను డిజైన్ చేయించిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Allu Arjun Designs Stop Mark Signature On Hi Car Tyres

  • తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న అల్లు అర్జున్
  • కారు టైర్లపై స్టాప్ మార్క్ సిగ్నేచర్ ‘ఏఏ’ డిజైన్
  • సోషల్ మీడియాలో పంచుకుంటున్న అభిమానులు

సెలబ్రిటీలు ఏంచేసినా అది వైరల్ అయిపోతుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు టైర్లకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతోంది. బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారన్నదే ఆ వార్త. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారట. కారు టైర్లపై స్టాప్ మార్క్ సిగ్నేచర్ ‘ఏఏ’మార్కు వేయించినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటారు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇప్పుడీ కారు, ఆ సిగ్నేచర్ మార్కు ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

బన్నీ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
  
       

Allu Arjun
Tollywood
Stop Mark Signature
Pushpa2
  • Loading...

More Telugu News