Jagga Reddy: మా మెట్టు సాయి బూటుతో కొడతాడు... బాల్క సుమన్ కు జగ్గారెడ్డి కౌంటర్

Jaggareddy counters Balka Suman

  • సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు
  • చెప్పు చూపించిన వైనం
  • ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి జగ్గారెడ్డి ప్రెస్ మీట్
  • నువ్వు బయట కూడా తిరగలేవు అంటూ బాల్క సుమన్ కు వార్నింగ్

చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పు చూపించడం తెలిసిందే. ఆ ఘటనకు కౌంటర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో తన పక్కన తెలంగణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయిని కూడా కూర్చోబెట్టుకున్న జగ్గారెడ్డి... బాల్క సుమన్ పై విరుచుకుపడ్డారు. మెట్టు సాయి బూటును పైకెత్తి ప్రదర్శిస్తుండగా, జగ్గారెడ్డి తన మాటల దాడిని కొనసాగించారు. 

"మేం తలుచుకుంటే నువ్వు బయట కూడా తిరగలేవు. ఎందుకయ్యా తొందరపడతావ్! పిల్లవాడివి పిల్లవాడిలాగానే ఉండాలి. చెప్పు చూపించి నువ్వేదో గొప్ప అనుకుంటే ఎలా? ఇప్పుడు కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి మా మెట్టు సాయి బూటు చూపెడతాడు. 

ఈ చెప్పులు చూపించే సంప్రదాయం తీసుకువచ్చిందే బీఆర్ఎస్ వాళ్లు. ఇవాళ మా మెట్టు సాయి ఈ బూటును కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీశ్ రావుకు, కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పు చూపిస్తే మెట్టు సాయి బూటుతో కొడతాడు. ఏం... కాంగ్రెస్ సీఎం అంటే తమాషాగా ఉందా?" అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagga Reddy
Balka Suman
Mettu Sai
Congress
BRS
Telangana

More Telugu News