Jani Master: సీఎం జగన్ తన అసలు రంగు బయటపెట్టుకున్నారు: జానీ మాస్టర్

Jani Master fires on Jagan

  • ఇటీవలే జనసేనలో చేరిన జానీ మాస్టర్
  • రూపాయికే ఇల్లు అని చెప్పిన జగన్ చివరకు శఠగోపం పెట్టారని విమర్శ
  • అనిల్ కుమార్ యాదవ్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్య

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరులో ఆయన మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని అన్నారు. రూపాయికే ఇల్లు అని చెప్పి చివరకు శఠగోపం పెట్టారని దుయ్యబట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చినా... అద్దె ఇళ్లలో అవస్థలు తప్పేవని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మొత్తం రివర్స్ అయిందని అన్నారు. 

రంగులు మార్చిన జగన్ తన అసలు రంగు బయట పెట్టుకున్నారని చెప్పారు. ఇళ్లు ఇప్పించండని పేదలు మొరపెట్టుకుంటున్నా... నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనిల్ గ్రాఫ్ పడిపోవడంతోనే ఆయనను గుంటూరు జిల్లాకు జగన్ పంపించారని ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లు ఇచ్చేంత వరకు పోరాడుతానని చెప్పారు.

Jani Master
Janasena
Jagan
Anil Kumar Yadav
YSRCP
  • Loading...

More Telugu News