Nagababu: ఓట్లు అడిగే వైసీపీ నేతల చెంప పగలగొట్టండి: నాగబాబు

Nagababu fires on YSRCP

  • అనకాపల్లిలో వైసీపీపై నిప్పులు చెరిగిన నాగబాబు
  • స్థానిక మంత్రికి గంజాయి రవాణాలో ప్రమేయం ఉందని ఆరోపణ
  • వైసీపీ హయాంలో 35 వేల మంది మహిళలు మాయమయ్యారన్న నాగబాబు

వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ స్థానిక మంత్రిపై నిప్పులు చెరిగారు. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రికి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఆ మంత్రి పేరు పలికినా నోరు పాడైపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే వైసీపీ నేతల చెంపలు వాయించాలని అన్నారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు నష్టం కలిగించిన వారిని, భూకబ్జాలు చేసే వారిని జైలుకు పంపిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 500 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందని అన్నారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో 35 వేల మంది మహిళలు మాయమయ్యారని... వీరిలో 25 వేల మంది ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదని నాగబాబు అన్నారు. దీనిపై జగన్ ఒక్క సమీక్ష  కూడా నిర్వహించలేదని విమర్శించారు. తమ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కఠినతరం చేస్తామని... తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 

Nagababu
Janasena
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News