Suresh: ఆ సంఘటన తరువాతే దేవుడిని నమ్మడం మొదలుపెట్టాను: హీరో సురేశ్

Suresh Interview

  • హ్యాండ్సమ్ అనిపించుకున్న సురేశ్  
  • ఆ తరువాత విలన్ వేషాలు వేసిన హీరో 
  • 'అమ్మోరు' సినిమా గురించిన ప్రస్తావన 
  • అప్పుడు జరిగిన సంఘటన గురించి వెల్లడి


హీరో సురేశ్ .. ఒకప్పుడు కోలీవుడ్ లో లవర్ బాయ్. ఆ తరువాత తెలుగులో హ్యాండ్సమ్ హీరో. ఫ్యామిలీ హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్న సురేశ్, ఆ తరువాత కాలంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా చేశాడు. ప్రస్తుతం ఆయన కేరక్టర్ ఆర్టిస్టుగా తనకి నచ్చిన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తనకి ఎదురైన ఒక అనుభవం గురించి చెప్పాడు. 

"ఒక సినిమాలో జలపాతం క్రింద ఒక పాటను వారం రోజుల పాటు చిత్రీకరించారు. అలా తడవడం వలన నాకు సైనస్ వచ్చింది. చాలా రోజుల పాటు ఆ సమస్య నన్ను ఇబ్బంది పెడుతూనే వచ్చింది. జలుబు .. తలనొప్పి .. ముఖం ఒక వైపు వాచినట్టుగా అనిపించి ఇబ్బందిపడేవాడిని. ఆ సమస్య కారణంగా చాలా సినిమాలు వదులుకోవలసి వచ్చింది" అని అన్నాడు. 

'అమ్మోరు' సినిమా జరుగుతుండగా కూడా ఇదే సమస్య. షాట్ గ్యాప్ లో తలపట్టుకుని అక్కడి అమ్మవారి గుడి అరుగుపై కూర్చున్నాను. గుళ్లో పనిచేసే ఒక వృద్ధుడు నా సమస్య అడిగి తెలుసుకున్నాడు. మరునాడు ఉదయాన్నే రమ్మన్నాడు. నిజానికి నాకు దైవంపై అవగాహన లేదు. అయినా ఆయన చెప్పిన సమయానికి వెళ్లాను. నన్ను టచ్ చేయకుండా నా నీడను చూస్తూ ఏవో మంత్రాలు చదివి, అమ్మవారి బొట్టు పెట్టాడు. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఆ సమస్య నన్ను ఇబ్బంది పెట్టలేదు. అప్పటి నుంచి నాకు దైవంపై నమ్మకం పెరిగింది" అని చెప్పాడు. 

Suresh
Actor
Ammoru Movie
  • Loading...

More Telugu News