Jagan: పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్.. వీడియో ఇదిగో!

CM Jagan reaches parliament

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్
  • కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్న ముఖ్యమంత్రి
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్న సీఎం

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాని మోదీతో భేటీ అనంతరం వీరి మధ్య చర్చలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  

Jagan
YSRCP
Narendra Modi
BJP
Parliament
  • Loading...

More Telugu News