Jagan: కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్

CM Jagan to meet PM Modi today

  • 11 గంటలకు మోదీతో భేటీ కానున్న జగన్
  • 11.45 గంటలకు నిర్మలా సీతారామన్ తో భేటీ
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం

ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్, పలు అభవృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులతో జగన్ కలిసే అవకాశం ఉంది. 

నిన్న రాత్రి ఢిల్లీకి జగన్ చేరుకున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

Jagan
YSRCP
Narendra Modi
Nirmala Sitharaman
BJP
Delhi
AP Politics
  • Loading...

More Telugu News