Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన

Hyderabad book fair begins today

  • ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ఫెయిర్
  • నగరంలోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) పుస్తక ప్రదర్శన ఏర్పాటు
  • బుక్‌ఫెయిర్‌ను ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
  • మీడియా సమావేశంలో బుక్‌ఫెయిర్ వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్

పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ..36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. గురువారం పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని చెప్పారు. 10 నుంచి 18వ తేదీ వరకూ పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కూడా చెప్పారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.

Hyderabad Book Fair
Hyderabad
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News