WhatsApp: వాట్సాప్ యూజర్లకు త్వరలో కొత్త సర్వీస్!

WhatsApp users soon to get AI Support

  • ‘ఏఐ సపోర్ట్’ ద్వారా యూజర్ల సందేహాలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించనున్న మెసేజింగ్ యాప్
  • త్వరలోనే ఏఐ ఆధారిత ఫీచర్‌ను ఆవిష్కరించనున్న కంపెనీ
  • వేగంగా పరిష్కారాలు పొందనున్న యూజర్లు

ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే పాప్యులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్ యాప్’ త్వరలో యూజర్ల సౌకర్యార్థం కొత్త సేవను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఏఐ టెక్నాలజీ ఆధారిత ఫీచర్ ద్వారా యూజర్ల ఫిర్యాదు, సందేహాలను సత్వరమే పరిష్కరించబోతోంది. ఈ మేరకు నూతన ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని ‘వాబెటాఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ల ఫిర్యాదులు, ప్రశ్నలకు తక్షణ స్పందన లభించనుందని తెలిపింది.  అన్ని వెర్షన్‌లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, పని గంటల ఆవల కూడా యూజర్లకు ఏఐ ఫీచర్ పరిష్కారాలు లభించనున్నాయని వివరించింది. వేగంగా, సమయాన్ని ఆదా చేసే రీతిలో ప్రతిస్పందన ఉంటుందని వివరించింది.

ఈ మేరకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుత పరీక్షిస్తోందని ‘వాబెటాఇన్ఫో’ రిపోర్ట్ వెల్లడించింది. వాట్సాప్ కస్టమర్ సేవల సిబ్బంది అందుబాటులో లేని సమయంలో కూడా వినియోగదారులకు సకాలంలో అవసరమైన సాయం అందుతుందని పేర్కొంది. అయితే ఏఐ ఫీచర్ ద్వారా అందిన సహాయం సంతృప్తికరంగా లేకపోతే యూజర్లు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడవచ్చని వివరించింది. కాగా వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు.

WhatsApp
AI Support
WhatsApp AI feature
Whatsapp Update
  • Loading...

More Telugu News