Galla Jayadev: చంద్రబాబుపై గల్లా జయదేవ్ ప్రశంసల జల్లు

Galla Jayadev hails TDP supremo Chandrababu Naidu

  • ఢిల్లీలో చంద్రబాబు పర్యటన
  • గల్లా జయదేవ్ ఇంట చంద్రబాబుకు ఆతిథ్యం
  • మీరే మాకు స్ఫూర్తి అంటూ చంద్రబాబు అభిమానాన్ని చాటుకున్న గల్లా

రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన చివరి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్నారు. పార్లమెంటు  సమావేశాల్లో ఆయన టీడీపీ ఎంపీలతో కలిసి కనిపిస్తున్నారు. 

కాగా, బుధవారం నాడు ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు గల్లా జయదేవ్ తన నివాసంలోనే ఆతిథ్యమిచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గల్లా నివాసానికి వెళ్లిన చంద్రబాబు... అక్కడ్నించే అమిత్ షాను కలవడానికి వెళ్లారు. 

ఈ నేపథ్యంలో, గల్లా జయదేవ్ సోషల్ మీడియాలో స్పందించారు. చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. 

"గత రెండ్రోజులుగా మా దార్శనిక నేత చంద్రబాబుతో గడపడం ఎంతో సుసంపన్నమైన, ఆలోచనాత్మకమైన అనుభూతిని కలిగించింది. ఏపీ ప్రజల హక్కుల కోసం మేం పార్లమెంటులోనూ, వెలుపల సాగిస్తున్న పోరాటంలో వివిధ సమస్యల క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన పరిజ్ఞానం, అవగాహన వెలకట్టలేనివి. గత పదేళ్లుగా, నా పదవీకాలంలో మీ అచంచల ప్రోత్సాహానికి, మీరందించిన స్ఫూర్తికి కృతజ్ఞతలు సర్. మీ నాయకత్వం మా అందరికీ వెలుగు దివ్వె వంటిది" అంటూ గల్లా జయదేవ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబుతో కలిసున్న ఫొటోలను కూడా పంచుకున్నారు.

Galla Jayadev
Chandrababu
TDP
Guntur
Andhra Pradesh
  • Loading...

More Telugu News